Wednesday, September 15, 2010

అలనాటి పాటలు old song lyrics

జోరుగా ఉషారుగా షికారు పోదామా ...చిత్రం : బార్యా భర్తలు
జోరుగా హుషారుగా షికారు పోదామా
హాయి హాయిగా తీయ తీయ్యగా

జోరుగా హుషారుగా షికారు పోదామా
హాయి హాయిగా తీయ తీయ్యగా జోరుగా


ఓ బాల నీ వయ్యారమెంచి మరులుకొంటినే
చాల ప్రేమ పాఠములను చదువుకొంటినే

ఓ బాల నీ వయ్యారమెంచి మరులుకొంటినే
చాల ప్రేమ పాఠములను చదువుకొంటినే

మరువనంటినే మరువనంటినే ఓ.....


జోరుగా


నీ వన్నె చిన్నెలన్ని చూసి వలచినాడనే

వయసు సొగసు తలచి తలచి మురిసినాడనే

వన్నె చిన్నెలన్ని చూసి వలచినాడనే

వయసు సొగసు తలచి తలచి మురిసినాడనే

కలిసిరాగదే కలిసిరాగదే ఓ.....


జోరుగా


నా కలలలోన చెలియా నిన్నే పిలిచినాడనే కనులు తెరిచి నిన్ను నేనే కాంచినాడనే

నా కలలలోన చెలియా నిన్నే పిలిచినాడనే కనులు తెరిచి నిన్ను నేనే కాంచినాడనే

వరించినాడనే వరించినాడనే ఓ.....
=======================================
కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు ...చిత్రం :అందమైన అనుభవం
కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు

కళ్లాలే లేనోళ్ళు కవ్వించే సోగ్గాళ్ళు

కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు

కళ్లాలే లేనోళ్ళు కవ్వించే సోగ్గాళ్ళు

ఆటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు

హద్దులేవి లేనివాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు రా రా ర రీ ఓ..


కుర్రాళ్ళు



గతమును పూడ్చేది వీళ్ళు చరితను మార్చేది వీళ్ళు

కథలై నిలిచేది వీళ్ళు కాలాలకు పందిళ్ళు వీళ్ళు

వీళ్లేనోయ్ నేటి మొనగాళ్ళు చెలిమికెపుడూ జతగాళ్ళు

చెడుపుకేపుడు పగవాళ్ళు వీళ్ళు వయసు నూరేళ్ళు నూరేళ్ళకు కుర్రాళ్ళు

హద్దులేవి లేనివాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు రా రా ర రీ ఓ..


కుర్రాళ్ళు


అం..అం..అం

తళతళ మెరిసేటి కళ్లు నిగానిగాలాడేటి వొళ్ళు

విసిరే చిరునవ్వు జల్లు ఎదలో నాటెను ముళ్ళు

తీయాలోయ్ దాన్ని చేలివేళ్ళు

నిదురరాని పొదరిల్లు బ్రహ్మచారి పడకిల్లు

మూసివున్న వాకిళ్ళు తెరచినపుడే తిరునాళ్ళు

ఆటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు

హద్దులేవి లేనివాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు రా రా ర రీ ఓ..


కుర్రాళ్ళు


నీతులుచెప్పే ముసలాళ్ళు నిన్న మొన్నటి కుర్రాళ్ళు

దులిపేయ్ ఆనాటి బూజులు మనవే ముందున్న రోజులు

తెంచేసేయ్ పాతసంకేళ్ళు మనషులె మననేస్తాలు మనసులే మన కోవెలలు
come on clap everybody

మనషులె మననేస్తాలు మనసులే మన కోవెలలు మనకు మనమే దేవుళ్ళు మార్చిరాయి శాస్త్రాలు

ఆటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు

హద్డులేవి లేనివాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు రా రా ర రీ ఓ..

come on join together


కుర్రాళ్ళు
నాలుగు కళ్లు రెండైనాయి ....: చిత్రం : ఆత్మబలం
నాలుగు కళ్లు రెండైనాయి రెండు మనసులు ఒకటైనాయి

నాలుగు కళ్లు రెండైనాయి రెండు మనసులు ఒకటైనాయి

ఉన్నా మనసు నీకర్పణ చేసి లేని దాన నైనాను ఏమి లేని దాననైనాను


కనులకు కలలే బరువైనాయి కన్నీళ్ళయినా కరువైనాయి

కనులకు కలలే బరువైనాయి కన్నీళ్ళయినా కరువైనాయి

రెండు లేకా పండు రేకులై ఎందుకు నాకీ కనుదోయి

ఇంకెందుకు నాకీ కనుదోయి


కదిలే శిలలా మారిపోతిని కధగానైనా మిగలనైతిని

కదిలే శిలలా మారిపోతిని కధగానైనా మిగలనైతిని

నిలువునా నన్ను దోచుకుంటివి నిరుపెదగా నే నిలిచిపోతిని

నిరుపేదగా నే నిలిచిపోతిని

======================


ఓ నారాజా రావా రావా ....:చిత్రం :ఆమె ఎవరు
ఓ నా రాజా రావా రావా చెలినే మరిచేవా

ఓ నా రాజా రావా రావా


నీ రూపే ఆశా రేపెను నీ మాటే వీణ మీటేను

నీ రూపే ఆశా రేపెను నీ మాటే వీణ మీటేను

గతాలే నన్ను పిలిచాయి ఆ హాయే నేడు లేదోయి

కలగా కరిగిందంతా జగమే ఏంటో వింత

రేయి పగలు నిన్నే వెదికేనూ


వృధాగా కాలమేగెను నిరాశే పొంగి వచ్చెను

వృధాగా కాలమేగెను నిరాశే పొంగి వచ్చెను

తరంగం లాగ రావోయి ప్రియా నన్నాడుకోవోయి

ఏదో తీరని బాధ కన్నీరోలికే గాధ

రేయి పగలు నిన్నే వెదికేను


నీ కోసం నేనే వచ్చాను నీ ఇంటికి దీపం అయినాను

నీకోసం నేనే వచ్చాను నీ ఇంటికి దీపం అయినాను

నాతోని ఆడుకోవేల ఈ కోపం నేడు నీకెలా

నీ అడుగులలో నేను నా కన్నులలో నీవు


నాలో నీవు నీలో నేనేలే
==============================

నా మనసే గోదారి .... చిత్రం : అదృష్టవంతులు

నా మనసే గోదారి

నీ వయసే కావేరి

భోల్ రాదా భోల్ రెండు కలిసేనా లేదా

అరె భోల్ రాదా భోల్ జోడి కుదిరేనా లేదా


నేనేం చేసేదయ్యో

దద్దమ్మవు దొరికావు

అరె ఎం చెప్పేదయ్యో

సుద్ధ మొద్దువి దొరికావు

నేనేం చేసేదయ్యో

దద్దమ్మవు దొరికావు

అరె ఎం చెప్పేదయ్యో

సుద్ధ మోద్దువి దొరికావు

సుద్ధ మొద్దువి దొరికావు

సుద్ధ మోద్దువి దొరికావు


కృష్ణుడు నేనే

రుక్మిణి నీవే

రాతిరి ఎత్తుకు పోతానే

లారీ మెల్లగా తోలుకువస్తా చల్లగా లేచిపోదాము

మీ అమ్మే యమగండం మా తల్లే సుడిగుండం

మీ అమ్మే యమగండం మా తల్లే సుడిగుండం

భోల్ రాదా భోల్ గండం తప్పేనా లేదా

అరె భోల్ రాదా భోల్ జోడి కుదిరేనా లేదా

లావోక్కిన్తయు లేదు దైర్యం విలోలంబయ్యే

ప్రాణమ్ ఠావుల్ దప్పెను మూర్చ వచ్చే

మనసే తారెట్టే మా ప్రేమయే జావి పోయెను

గుండెలే పగిలి చద్దామింక దిక్కేవ్వరో

పోవే శాకినీ డాకినీ కదులు పో పో వెళ్ళిపో లంకిణీ

భోల్ అమ్మా భోల్ జోడి కలిసిందా లేదా

భోల్ అత్తా భోల్ రోగం కుదిరిందా లేదా

==============================

కోడి కూసే జాము కాడ ....చిత్రం : అదృష్టవంతులు

కోడి కూసే జాము దాకా తొడురారా చందురూడా

కోడె కారు కొత్త కోర్కెలు తరుముతున్నవి అందగాడా

కోడి కూసే జాము దాకా తోడురారా చందురూడా

కోడె కారు కొత్త కోర్కెలు తరుముతున్నవి అందగాడా


కన్నె బుగ్గకు సిగ్గు కమ్మెను కళ్లు చూస్తె కైపులెక్కెను

కన్నె బుగ్గకు సిగ్గు కమ్మెను కళ్లు చూస్తె కైపులెక్కెను

కాపురానికి కొత్తవాళ్ళం కాడిమోయని కుర్రవాళ్ళం

కలలు తెలిసిన చిలిపివాడా కలుపరా మము కలువరేడా


కంటికిమ్పౌ జంటలంటే వెంట పడతావంత నువ్వు

కంటికిమ్పౌ జంటలంటే వెంట పడతావంత నువ్వు

తెల్లవార్లూ చల్ల చల్లని వెన్నెలలతో వేపుతావట

తెల్లవార్లూ చల్ల చల్లని వెన్నెలలతో వేపుతావట

మత్తు తెలిసిన చందురూడా మసక వెలుగే చాలులేరా


అల్లుకున్న మనసులున్నవి అలసిపోని బంధమున్నది

అల్లుకున్న మనసులున్నవి అలసిపోని బంధమున్నది

చెలిమి నాటిన చిన్న ఇంట ఎదగనీ మా వలపు పంట

చెలిమి నాటిన చిన్న ఇంట ఎదగనీ మా వలపు పంట

తీపిమబ్బుల చందురూడా కాపువై నువ్వుండిపోరా

=============================================

ఏవమ్మా నిన్నే నమ్మా ఎలా ఉన్నావు ..చిత్రం : తేనె మనసులు

ఏవఁమ్మా నిన్నేనమ్మా ఏలా ఉన్నావు
ఏదోలెండి మీ దయవల్ల ఈలా ఉన్నాను
ఏవఁమ్మా నిన్నేనమ్మా ఏలా ఉన్నావు
ఊఁ ఏదోలెండి మీ దయవల్ల ఈలా ఉన్నాను
ఆలాగంటే ఏలాగండి అయినవాళ్ళని అడిగాము
ఆలాగంటే ఏలాగండి అయినవాళ్ళని అడిగాము
అంతేలెండి అంతకు మించి ఏదో ఏదో ఉందని అన్నానా
ఏవఁమ్మా నిన్నేనమ్మా ఏలా ఉన్నావు
ఏదోలెండి మీ దయవల్ల ఈలా ఉన్నాను
నడవకు నడవకు అమ్మయ్యో నడిచావంటే అమ్మయ్యో
నడుమే నలిగిపోతుంది నీ నడుమే నలిగిపోతుంది
పొగడకు పొగడకు అయ్యయ్యో పొగిడారంటే అయ్యయ్యో
మనిషే వెగటైపోతారు మనిషే వెగటైపోతారు
ఏవఁమ్మా నిన్నేనమ్మా ఏలా ఉన్నావు
ఏదోలెండి మీ దయవల్ల ఈలా ఉన్నాను
చూడకు అలా చూడకు ..
చూసావంటే ఏదో ఏదో ఔతోంది .. ఎదలో ప్రేమే పుడుతోంది
ఏదో ఏదో ఔతోంది .. ఎదలో ప్రేమే పుడుతోంది
పుట్టనీ పాపం పుట్టనీ ప్రేమే పుడితే
పెంచేదాన్నీ నేనున్నాలాలించేదాన్నీ నేనున్నా
జోజోజో… జోజోజో…
ఏవఁమ్మా నిన్నేనమ్మా ఏలా ఉన్నావు
ఏదోలెండి మీ దయవల్ల ఈలా ఉన్నాను
ఏవఁమ్మా నిన్నేనమ్మా ఏలా ఉన్నావు
ఏదోలెండి మీ దయవల్ల ఈలా ఉన్నాను

దివినుండి భువికి దిగివచ్చే .....చిత్రం : తేనె మనసులు

దివినుండి భువికి దిగివచ్చే దిగివచ్చే పారిజాతమే నీవై నీవై ..2
గుడిలోని ప్రతిమ వచ్చింది వచ్చింది కోటి ప్రభలతో నీవై నీవై..2
దివినుండి భువికి దిగివచ్చే దిగివచ్చే పారిజాతమే నీవై నీవై
అందని జాబిలి అందాలు పొందాలి అనుకున్నానొకనాడు ఆనాడు ..2
అందిన జాబిలి పొందులో అందాలు … అందిన జాబిలి పొందాలో అందాలు
పొందాను ఈనాడు ఈనాడు …. పొందాను ఈనాడు ఈనాడు
దివినుండి భువికి దిగివచ్చే దిగివచ్చే పారిజాతమే నీవై నీవై
కనరాని దేవుని కనులా జూడాలని కలగంటి నొకనాడు ఆనాడు...2
కల నిజము చేసి కౌగిలిలో జేర్చి .. కల నిజము చేసి కౌగిలిలో జేర్చి
కరిగించే ఈనాడు ఈనాడు … కరిగించే ఈనాడు ఈనాడు
గుడిలోని ప్రతిమ వచ్చింది వచ్చింది కోటి ప్రభలతో నీవై నీవై
కడలిలో పుట్టావు అలలపై తేలావు నుఱగవై వచ్చావు ఎందుకో ..2
కడలి అంచువు నిన్ను కలిసి నీ ఒడిలో ..
కడలి అంచువు నిన్ను కలిసి నీ ఒడిలో
ఒరిగీ కరగాలని ఆశతో ….
దివినుండి భువికి దిగివచ్చే దిగివచ్చే పారిజాతమే నీవై నీవై
అ …. గుడిలోని ప్రతిమ వచ్చింది వచ్చింది కోటి ప్రభలతో నీవై నీవై
దివినుండి భువికి దిగివచ్చే దిగివచ్చే పారిజాతమే నీవై నీవై
=======================================

ముక్కు మిద కోపం నీ ముఖానికే అందం : చిత్రం : మూగ మనసులు

ముక్కు మీద కోపం నీ ముఖానికే అందం
నా బుంగమూతి సందం నీ ముందరి కాళ్ళ బంధం ఉహు ఉహు ఉహు
ఆ ముక్కు మీద కోపం నీ ముఖానికే అందం
నా బుంగమూతి సందం నీ ముందరి కాళ్ళ బంధం
అడపదడప ఇద్దరు అలిగితనే అందం
అడపదడప ఇద్దరు అలిగితనే అందం
అలక తీరి కలిసేదే అందమైన బంధం

అలక తీరి కలిసేదే అందమైన బంధం
ఆ ముక్కు మీద కోపం నీ ముఖానికే అందం
నా బుంగమూతి సందం నీ ముందరి కాళ్ళ బంధం
చిన్నదాని బుగ్గలకు సిగ్గొస్తే అందం
చిన్నదాని బుగ్గలకు సిగ్గొస్తే అందం
బుగ్గమీద సిటికేటి దగ్గరొస్తే బంధం
ఆ బుగ్గమీద సిటికేటి దగ్గరొస్తే బంధం
హొయ్ ఆ ముక్కు మీద కోపం నీ ముఖానికే అందం
నా బుంగమూతి సందం నీ ముందరి కాళ్ళ బంధం
ఈడొచ్చిన పిల్లకు జోడుంటే అందం
ఈడొచ్చిన పిల్లకు జోడుంటే అందం
ఈడుజోడు కుదిరినాక మూడుముళ్ళే బంధం
ఈడుజోడు కుదిరినాక మూడుముళ్ళే బంధం
ఉహు ఉహు ఉహు
ముక్కు మీద కోపం నీ ముఖానికే అందం
నా బుంగమూతి సందం నీ ముందరి కాళ్ళ బంధం
తల్లి గోదారికి ఎల్లువొస్తే అందం
తల్లి గోదారికి ఎల్లువొస్తే అందం
ఎల్లువంటి బుల్లోడికి పిల్లగౌరి బంధం

ఎల్లువంటి బుల్లోడికి పిల్లగౌరి బంధం
డుర్ర్ ముక్కు మీద కోపం నీ ముఖానికే అందం
నా బుంగమూతి సందం నీ ముందరి కాళ్ళ బంధం
హొయ్ ముక్కు మీద కోపం నీ ముఖానికే అందం
నా బుంగమూతి సందం నీ ముందరి కాళ్ళ బంధం
============================

ముద్దబంతి పూవులో మూగ కళ్ళ ఊసులో : చిత్రం : మూగ మనసులు

ముద్దబంతి పువ్వులో మూగకళ్ళ ఊసులో
ముద్దబంతి పువ్వులో మూగకళ్ళ ఊసులో
ఎనక జనమ బాసలు ఎందరికి తెలుసులే
పూలదండలో దారం దాగుందని తెలుసును
పాలగుండెలో ఏది దాగుందో తెలుసునా ఆ ఆ ఆ ఆ ఆ ఆ
పూలదండలో దారం దాగుందని తెలుసును
పాలగుండెలో ఏది దాగుందో తెలుసునా
నవ్వినా ఎడ్చినా
నవ్వినా ఎడ్చినా కన్నీళ్ళే వస్తాయి
ఏ కన్నీటెనకాల ఎముందో తెలుసునా
ముద్దబంతి పువ్వులో మూగకళ్ళ ఊసులో
ఎనక జనమ బాసలు ఎందరికి తెలుసులే
మనసు మూగదే కాని బాసుండది దానికి
సెవులుండే మనసుకే ఇనిపిస్తుందా ఇది
ఎద మీద ఎదబెట్టి సొదలన్నీ ఇనుకో
ఇనుకొని బతుకును ఇంపుగా దిద్దుకో
ముద్దబంతి పువ్వులో మూగకళ్ళ ఊసులో
ఎనక జనమ బాసలు ఎందరికి తెలుసులే
ముక్కోటి దేవుళ్ళు మురిసి సూస్తుంటారు
ముందు జనమ బంధాలు ముడియేసి పెడతారు ఆ ఆ ఆ అ
ముక్కోటి దేవుళ్ళు మురిసి సూస్తుంటారు
ముందు జనమ బంధాలు ముడియేసి పెడతారు
కన్నోళ్ళ కన్నీళ్ళు కడుపుతీపి దీవెనలు
కన్నోళ్ళ కన్నీళ్ళు కడుపుతీపి దీవెనలు
మూగమనసు బాసలు ఈ మూగమనసు బాసలు
మీకిద్దరికి సేసలు
ముద్దబంతి పువ్వులో మూగకళ్ళ ఊసులో
ఎనక జనమ బాసలు ఎందరికి తెలుసులే
ముద్దబంతి పువ్వులో ఓ ఓ ఓ
======================

ఎక్కడో దూరాన కుర్చోన్నావు ..చిత్రం : దేవుడమ్మ

ఎక్కడో దూరాన కూర్చున్నావు … ఇక్కడి మా తలరాతలు రాస్తున్నావు
చిత్రమైన గారడి చేస్తున్నావు … తమాష చూస్తున్నావు … సామీ …
ఎక్కడో దూరాన కూర్చున్నావు … ఇక్కడి మా తలరాతలు రాస్తున్నావు
చిత్రమైన గారడి చేస్తున్నావు … తమాష చూస్తున్నావు … సామీ …
ఎక్కడో దూరాన కూర్చున్నావు
లేనిపోని భ్రమలెన్నో కలిగిస్తావు ,,, మమ్ము తోలుబొమ్మలను చేసి ఆడిస్తావు
లేనిపోని భ్రమలెన్నో కలిగిస్తావు ,,, మమ్ము తోలుబొమ్మలను చేసి ఆడిస్తావు
అంతా మా సొంతమని అనిపిస్తావు ..

అంతలోనే మూడునాళ్ళ ముచ్చటగా …..చేసేస్తావు … సామీ …
ఎక్కడో దూరాన కూర్చున్నావు … ఇక్కడి మా తలరాతలు రాస్తున్నావు
చిత్రమైన గారడి చేస్తున్నావు … తమాష చూస్తున్నావు … సామీ …
ఎక్కడో దూరాన కూర్చున్నావు
పెరుగుతుంది వయసనీ అనుకుంటాము … కాని తరుగుతుంది ఆయువని తెలుసుకోము
పెరుగుతుంది వయసనీ అనుకుంటాము … కాని తరుగుతుంది ఆయువని తెలుసుకోము
కళ్ళు తెరిచి నిజమేదో తెలిసే లోగా
మా కళ్ళముందు మాయతెరలు … కప్పేస్తావు … సామీ
ఎక్కడో దూరాన కూర్చున్నావు … ఎక్కడో దూరాన కూర్చున్నావు …
ఎక్కడో దూరాన కూర్చున్నావు … సామీ …. ఎక్కడో దూరాన కూర్చున్నావు …
=======================================

ఆలయాన వెలసిన అ దేవుని రీతి ..చిత్రం : దేవత

ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి
ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి..2
. ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి
పతిదేవుని మురిపించే వలపుల వీణ
జీవితమే పండించే నవ్వుల వాన
కష్టసుఖాలలో తోడునీడగా
తల్లిని మరిపించే ఇల్లాలి ఆదరణ...2
మగువేగా మగవానికి మదుర భావన ….
ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి
ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి ..
ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి
సేవలతో ఆత్తమామ సంతసించగా
పదిమందిని ఆదరించు కల్పవల్లిగా..2
తనయుని వీరునిగ పెంచే తల్లిగా
సతియే గృహసీమను గాచే దేవతగా......2
సృష్టించెను ఆ దేవుడు తనకు మారూగా ….

ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి
ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి ..
ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి
========================

భారత మాత కు జేజే లు ..చిత్రం : బడిపంతులు

భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు
భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు
ఆసేతు హిమాచల సస్యశ్యామల జీవధాత్రికి జేజేలు
ఆసేతు హిమాచల సస్యశ్యామల జీవధాత్రికి జేజేలు
భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు
త్రివేణి సంగమ పవిత్రభూమి నాల్గు వేదములు పుట్టిన భూమి
గీతామృతమును పంచిన భూమి పంచశీల బోధించిన భూమి

పంచశీల బోధించిన భూమి
భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు
శాంతిదూతగా వెలసిన బాపూ జాతి రత్నమై వెలిగిన వెహ్రూ
శాంతిదూతగా వెలసిన బాపూ జాతి రత్నమై వెలిగిన వెహ్రూ
విప్లవ వీరులు వీర మాతలు …

విప్లవ వీరులు వీర మాతలు …
ముద్దుబిడ్డలై మురిసే భూమి ..
భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు
సహజీవనము సమభావనము మనతా వాదము వేదముగా
ప్రజా క్షేమము ప్రగతి మార్గము లక్ష్యములైన విలక్షణ భూమి
లక్ష్యములైన విలక్షణ భూమి
భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు
ఆసేతు హిమాచల సస్యశ్యామల జీవధాత్రికి జేజేలు
భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు
=============================

గుడివాడ ఎల్లాను గుంటూరు పోయాను ..:చిత్రం : యమగోల

గుడివాడ ఎల్లాను గుంటూరు పొయ్యాను
గుడివాడ ఎల్లాను గుంటూరు పొయ్యాను
ఏలూరు నెల్లూరు ఎన్నెన్నో చూసాను
ఏడ చూసినా ఎంత చేసినా ఏదో కావాలంటారు
సచ్చినోళ్ళు ఆటకు వచ్చినోళ్ళు
అబ్బబ్బబ్బ సచ్చినోళ్ళు ఆటకు వచ్చినోళ్ళు
కమ్మని పాట చక్కని ఆట కావాలంటారు కొందరు బుద్దిగ ఉంటారు
కసి కసిగా హా కొందరు నన్ను పాడమంటారు పచ్చిగ ఆడమంటారు
నచ్చారంటె జై కొడతారు నచ్చకపోతే చీ కొడతారు
పిచ్చి పిచ్చిగా పైపడతారు దుమ్ము కాస్తా దులిపేస్తారు
పోకిరోళ్ళు యమ పోజుగాళ్ళు
ఓ యబ్బో పోకిరోళ్ళు యమ పోజుగాళ్ళు
గుడివాడ ఎల్లాను గుంటూరు పొయ్యాను
చిత్తూరు పుట్టూరు ఎన్నెన్నో చూసాను
బందరులోనా అందరిలోనా రంభవి అన్నాడు ఒకడు రావే అన్నాడు
వైజాకు బాబు చేసాడు డాబు రేటెంతన్నాడు ఆటకు రేటెంతన్నాడు
కాకినాడలో గల్లంతాయె తిరపతి లోనా పరపతి పోయే
అన్రై మెప్పు పొందాలంటె దేవుడైకైన తరం కాదు
ఆ యముడికైనా తరం కాదు
గట్టివాళ్ళు ఆటకు వచ్చినోళ్ళు
అమ్మమ్మో గట్టివాళ్ళు ఆటకు వచ్చినోళ్ళు
గుడివాడ ఎల్లాను గుంటూరు పొయ్యాను
ఒంగోలు వరంగల్లు ఎన్నెన్నో చూసాను
===================

ursday, April 9, 2009


ఓ లమ్మి తిక్క రేగిందా ...చిత్రం : యమగోల

ఓలమ్మీ తిక్క రేగిందా వొళ్ళంతా తిమ్మిరెక్కిందా
ఓలమ్మీ తిక్క రేగిందా వొళ్ళంతా తిమ్మిరెక్కిందా
తిక్కరేగి తిమ్మిరెక్కి పైరగాలి పైట తీసి
పందిరేసి చిందులేసిందా
ఓరబ్బీ తిక్కరేగిందా వొళ్ళంతా తిమ్మిరెక్కిందా
ఓరబ్బీ తిక్కరేగిందా వొళ్ళంతా తిమ్మిరెక్కిందా
తిక్కరేగి తిమ్మిరెక్కి పిల్ల చిచ్చురేపి
రెచ్చగొట్టిందా కొత్త పిచ్చి పట్టిందా
గాలికురక కన్నెపిల్ల కన్ను చెదిరిందా
మూరతక్కువ చీర నీకు నిలవనంటుందా
పక్కపలక ఉడుకు నీలో అలిసిపోయిందా
ముట్టుకుంటె ముద్దులయ్యె పట్టుకుంటె జారిపోయె
సిగ్గు వలపు మొగ్గలేసిందా
రంగు తేలి గిత్త పొగరు రంకె వేసిందా
గంగడోలు తాకితేనే కాలు చూపిందా
కోడె వయసు రొమ్ము విరిచి కొమ్ము విసిరిందా
పట్ట పగలే చుక్క పొడిచె పంటచేను
గట్టు మీద బంతిపూల పక్కవేసిందా
పక్కకొస్తే పడుచునెందుకు అలుసు చేస్తావు
చల్లకొచ్చి ముంత ఎందుకు దచుకుంటావు
వలపులోన కలుపు తీస్తే పదును చూస్తావు
ఆరుబయట అందమంత ఆరబోసి కస్సుమంటు
కన్నెమోజు కట్టు తప్పిందా
========================

ఆకు చాటు పిందె తడిసే ..చిత్రం : వేటగాడు

ఆకు చాటు పిందె తడిసే కోక మాటు పిల్ల తడిసే
ఆకు చాటు పిందె తడిసే కోక మాటు పిల్ల తడిసే
ఆకాశగంగొచ్చింది అందాలు ముంచెత్తింది
గోదారి పొంగొచ్చిందీ కొంగుల్ని ముడిపెత్తింది
గూడు చాటు గువ్వ తడిసే గుండె మాటు గుట్టు తడిసే
గూడు చాటు గువ్వ తడిసే గుండె మాటు గుట్టు తడిసే
ఆకాశగంగొచ్చింది అందాలు ముంచెత్తింది
గోదారి పొంగొచ్చింది కొంగుల్ని ముడిపెత్తింది
ముద్దిచ్చి ఓ చినుకు ముత్యమై పోతుంటే
అహ అహ అహాహ
చిగురాకు పాదాల సిరిమువ్వలవుతుంటే
అహ అహ అహ అహ
ఓ చినుకు నిను తాకి తడి ఆరి పోతుంటే
ఓ చినుకు నిను తాకి తడి ఆరి పోతుంటే
ఓ చినుకు నీ మెడలో నగ లాగ నవుతుంటే
నీ మాట విని మబ్బు మెరిసి అహ జడివానలే కురిసి కురిసి
వళ్ళు తడిసి వెల్లి విరిసి వలపు సరిగంగ స్నానాలు చెయ్యాలి
అహ అహ ఆహ అహ అహ ఆహ
మైమరచి ఓ మెరుపు నిన్నల్లుకుంటుంటే
అహ అహ అహ అహ
ఎదలోన ఓ మెరుపు పొదరిల్లు కడుతుంటే
అహ అహ అహా అహ
ఓ మెరుపు నీ చూపై ఉరిమేసి రమ్మంటే
ఓ మెరుపు నీ నవ్వై నన్నే నమిలేస్తుంటే
అహ నీ పాట విని మెరుపులొచ్చి
అహ నీ విరుపులే ముడుపు లిచ్చి
చలిని పెంచి చెలిమి పంచి తనలో వెచ్చంగా తడి ఆర్చుకోవాలి
అహ అహ ఆహ అహ అహ ఆహ
=============================

మిన్నేటి సూర్యుడు వచ్చెనమ్మా ..: చిత్రం :సీతా కోక చిలక

మిన్నేటి సూర్యుడు వచ్చేనమ్మా
పల్లె కోనెటి తామర్లు విచ్చేనమ్మా
అందమైన రంగవల్లులై ఎండలన్ని పూలజల్లులై
ముద్దుకే పొద్దు పొడిచె
మిన్నేటి
ఓ చుక్క నవ్వవే వేగుల చుక్కా నవ్వవే
కంటి కోలాటాల జంట పేరంటాలా
ఓ చుక్క నవ్వవే నావకు చుక్క నవ్వవే
పొందు ఆరాటాల పొంగు పోరాటాలా
మొగ్గ తుంచుకుంటె మొగమాటాలా
బుగ్గ దాచుకుంటె బులపాటాలా
దప్పికంటె తీర్చడానికిన్ని తంటాలా
మిన్నేటి
ఓ రామచిలకా చిక్కని ప్రేమ మొలక
గూడు ఏమందమ్మా ఈడు ఏమందమ్మా
ఈడుకున్న గూడు నువ్వె గోరింకా తోడుగుండిపోవె అంటి నీవింకా
పువ్వు నుంచి నవ్వునూ తుంచలేనులే యింక
============================

అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి..::చిత్రం :: మంచిమనిషికి మంచి రోజులు

వేళగాని వేళలో

ఊరు విడిచి దూరంగా

కారెక్కి ఒంటరిగా

గాలి మేయ వచ్చిన బూచీ నంగనాచి


అనుకున్నదొక్కటీ అయినది ఒక్కటీ

బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట

గుట్టు నిమిషం లో తెలిసిందిలే

గుండె దిగజారి నిలిచిందిలే

హే...

అనుకున్నదొక్కటీ అయినది ఒక్కటి

బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట.

చల్లని వెన్నెల కాస్తుంటే

చల్లగా ఇంట్లో నే ఉంటే

తలుపుమూసి చెప్పకనే ఏ..

డంగేసిన రాకాసి ఓ రాకాసి

హే అనుకున్నదొక్కటీ ........


ఏ బస్తీ కిలాడి

నాపేరే పల్లెటూరి వస్తాదు రౌడీ

నీ తెలివంతా జూపి నను గెలిచావా లేడీ

చిక్కావు చేతిలో కేడీ షోకైన లేడీ

అహ హ్హ

అనుకున్నదొక్కటి...
======================

ఆకాశ వీధిలో హాయిగా ఎగిరేవు ...చిత్రం :: మల్లీశ్వరి

ఆకాశ వీధిలో హాయిగా ఎగిరేవు

దేశ దేశాలన్ని తిరిగి చూసేవు

ఏడ తానున్నాడో బావ

జాడ తెలిసిన పోయిరావా!


గగనసీమల ఓ మేఘమాల

మా ఊరు గుడి పైని మసలి వస్తున్నావా!

మల్లి మాటేదైన నాతో మనసు చల్లగా చెప్పి పోవా

నీలాల ఓ మేఘమాల! రాగాల ఓ మేఘమాల!


మమత తెలిసిన మేఘమాల!

నా మనసు బావకు చెప్పి రావా!

ఎన్నాళ్లు నా కళ్లు దిగులుతో రేపగలు

ఎదురుతెన్నులు చూచెనే బావకై

చెదిరి కాయలు కాచెనే అందాల


మనసు తెలిసిన మేఘమాల!

మరువలేనని చెప్పలేవా!

మల్లితో మరువలేనని చెప్పలేవా!

కళ్లు తెరచినగాని కళ్లు మూసినగాని

మల్లి రూపే నిలిచెనే

నా చెంత మల్లి మాటే పిలిచెనే!


జాలి గుండెల మేఘమాల!

నా బావ లేనిది బ్రతుకజాల!

కురియు నా కన్నీరు గుండెలో దాచుకొని

వానజల్లుగ కురిసిపోవా కన్నీరు

ఆనవాలుగా బావమ్రోల
=======================


ఝుమ్మంది నాదం సై అంది పాదం ..: చిత్రం ::సిరిసిరి మువ్వ

ఝుమ్మంది నాదం సై అంది పాదం

తనువూగింది ఈ వేళ

చెలరేగింది ఒక రాసలీలా

ఝుమ్మంది నాదం సై అంది పాదం

తనువూగింది ఈ వేళా

చెలరేగింది ఒక రాసలీల

యెదలోని సొదలా సెలఏటి రొదలా

కదిలేటి నదిలా కలల వరదలా

యెదలోని సొదలా సెల ఏటి రొదలా

కదిలేటి నదిలా కలల వరదలా

చలిత లలితపదా కలిత కవిత లుగా

సరిగమ పలికించగా

స్వర మధురిమ లొలికించగా

సిరిసిరి మువ్వలు పులకించగా



ఝుమ్మంది



నటరాజ ప్రేయసి నటనాల ఊర్వశి

నటియించు నీవని తెలిసీ

నటరాజ ప్రేయసి నటనాల ఊర్వశి

నటియించు నీవని తెలిసీ

ఆకాశమై పొంగె ఆవేశం

కైలాసమే వంగె నీకోసం



ఝుమ్మంది

మెరుపుంది నాలో - అది నీ మేని విరుపు

ఉరుముంది నాలో - అది నీ మువ్వ పిలుపు

చినుకు చినుకులో చిందు లయలతో

కురిసింది తొలకరి జల్లు

విరిసింది అందాల హరివిల్లు

ఈ పొంగులే ఏడు రంగులుగా

ఝుమ్మంది


ఝుమ్మంది నాదం సై అంది పాదం ..: చిత్రం ::సిరిసిరి మువ్వ

ఝుమ్మంది నాదం సై అంది పాదం

తనువూగింది ఈ వేళ

చెలరేగింది ఒక రాసలీలా

ఝుమ్మంది నాదం సై అంది పాదం

తనువూగింది ఈ వేళా

చెలరేగింది ఒక రాసలీల

యెదలోని సొదలా సెలఏటి రొదలా

కదిలేటి నదిలా కలల వరదలా

యెదలోని సొదలా సెల ఏటి రొదలా

కదిలేటి నదిలా కలల వరదలా

చలిత లలితపదా కలిత కవిత లుగా

సరిగమ పలికించగా

స్వర మధురిమ లొలికించగా

సిరిసిరి మువ్వలు పులకించగా



ఝుమ్మంది



నటరాజ ప్రేయసి నటనాల ఊర్వశి

నటియించు నీవని తెలిసీ

నటరాజ ప్రేయసి నటనాల ఊర్వశి

నటియించు నీవని తెలిసీ

ఆకాశమై పొంగె ఆవేశం

కైలాసమే వంగె నీకోసం



ఝుమ్మంది

మెరుపుంది నాలో - అది నీ మేని విరుపు

ఉరుముంది నాలో - అది నీ మువ్వ పిలుపు

చినుకు చినుకులో చిందు లయలతో

కురిసింది తొలకరి జల్లు

విరిసింది అందాల హరివిల్లు

ఈ పొంగులే ఏడు రంగులుగా

ఝుమ్మంది
====================================
వగల రాణివి నీవె సొగసు కాడను నేనె

ఈడు కుదిరెను జోడు కుదిరెనూ మేడ దిగి రావె

వగల రాణివి నీవె సొగసు కాడను నేనె

ఈడు కుదిరెను జోడు కుదిరెనూ మేడ దిగి రావె


పిండి వెన్నెల నీ కోసం పిల్ల తెమ్మెర నా కోసం

పిండి వెన్నెల నీ కోసం పిల్ల తెమ్మెర నా కోసం

రెండు కలసిన నిండు పున్నమి రేయి మన కోసం


వగల


దోర వయసూ చినదానా ఓర చూపుల నెరజాణ

దోర వయసూ చినదానా ఓర చూపుల నెరజాణ

బెదరుటెందుకు కదులు ముందుకు ప్రియుడనే గానా


వగల


కోపమంతా పైపైనే చూపులన్నీ నాపైనే

కోపమంతా పైపైనే చూపులన్నీ నాపైనే

వరుని కౌగిట ఒరిగినంతట కరిగి పోదువులె


వగల

No comments:

Post a Comment

Related Posts with Thumbnails
 

Copyright 2008 All Rights Reserved Revolution Two Church theme by Brian Gardner Converted into Blogger Template by Bloganol dot com