Saturday, April 3, 2010

ఈ వేళలో నీవు ఏం చేస్తు వుంటావో
అనుకుంటువుంటాను ప్రతి నిమిషము నేను
నా గుండె ఏనాడో చే జారి పోయింది
నీ నీడగా మారి నా వైపు రానంది
దూరాన వుంటూనే ఏం మాయ చేసావో


ఈ వేళలో నీవు… ఏం చేస్తు వుంటావో
అనుకుంటువుంటాను ప్రతి నిమిషము నేను

నడి రేయిలో నీవు నిదరైన రానీవు
గడిపేదేలా కాలము గడిపేదేలా కాలము
పగలైన కాసేపు పని చేసుకోనీవు
నీ మీదనే ధ్యానము నీ మీదనే ధ్యానము

ఏ వైపు చూస్తున్నా నీ రూపే తోచింది
నువ్వు కాక వేరేది కనిపించనంటోంది

ఈ ఇంద్రజాలాన్ని నీవేనా చేసింది
నీ పేరులో ఏదో ప్రియమైన కైపుంది
నీ మాట వింటూనే ఏం తోచనీకుంది
నీ మీద ఆశేదో నను నిలవనీకుంది
మతి పోయి నేనుంటే నువ్వు నవ్వుకుంటావు…

ఈ వేళలో నీవు
ఏం చేస్తు వుంటావో
అనుకుంటువుంటాను
ప్రతి నిమిషము నేను

ఈ వేళలో నీవు
ఏం చేస్తు వుంటావో
అనుకుంటు.....ము ము హు ము హు హు హు హు హు హు హుః

====================================


ఊహలు గుస గుస లాడే ..చిత్రం :: బందిపోటు


ఊహలు గుస గుసలాడె

నా హ్రుదయము ఊగిసలాడె

వలదన్న వినదీ మనసు

కలనైన నిన్నె తలచు

తొలి ప్రేమలొ బలముందిలె

అది నీకు ముందే తెలుసు

నను కోరి చేరిన బేల

దూరాన నిలిచే వేళ

నీ ఆనతే లేకున్నచో విడలేను ఊపిరి కూడా

దివి మల్లె పందిరి వేసే

భువి పెళ్ళి పీటను వేసే

నెర వెన్నెల కురిపించుచూ నెలరాజు పెండ్లిని చేసే
=================================
అలిగిన వేళనె చూడాలి

అలిగిన వేళనె చూడాలి
గోకులకృష్ణుని అందాలు
అలిగిన వేళనె చూడాలి
రుసరుసలాడే చూపుల లోనే
ముసిముసి నవ్వుల చందాలు
అలిగిన వేళనె చూడాలి
అల్లన మెల్లన నల్లపిల్లి వలె
వెన్నను దొంగిల గజ్జెలు ఘల్లన
తల్లి మేలుకొని దొంగను జూచి ఆ...
అల్లరిదేమని అడిగినందుకే
అలిగిన వేళనె చూడాలి
గోకులకృష్ణుని అందాలు
అలిగిన వేళనె చూడాలి
మోహనమురళీగానము వినగా
తహతహలాడుచు తరుణులు రాగా
దృష్టి తగులునని జడిసి యశోద
తనను చాటుగా దాచినందుకే అలిగిన వేళనె చూడాలి
======================================
ముద్దబంతి పువ్వులో మూగకళ్ళ ఊసులో


ముద్దబంతి పువ్వులో మూగకళ్ళ ఊసులో
ముద్దబంతి పువ్వులో మూగకళ్ళ ఊసులో
ఎనక జనమ బాసలు ఎందరికి తెలుసులే
పూలదండలో దారం దాగుందని తెలుసును
పాలగుండెలో ఏది దాగుందో తెలుసునా ఆ ఆ ఆ ఆ ఆ ఆ
పూలదండలో దారం దాగుందని తెలుసును
పాలగుండెలో ఏది దాగుందో తెలుసునా
నవ్వినా ఎడ్చినా
నవ్వినా ఎడ్చినా కన్నీళ్ళే వస్తాయి
ఏ కన్నీటెనకాల ఎముందో తెలుసునా
ముద్దబంతి పువ్వులో మూగకళ్ళ ఊసులో
ఎనక జనమ బాసలు ఎందరికి తెలుసులే
మనసు మూగదే కాని బాసుండది దానికి
సెవులుండే మనసుకే ఇనిపిస్తుందా ఇది
ఎద మీద ఎదబెట్టి సొదలన్నీ ఇనుకో
ఇనుకొని బతుకును ఇంపుగా దిద్దుకో
ముద్దబంతి పువ్వులో మూగకళ్ళ ఊసులో
ఎనక జనమ బాసలు ఎందరికి తెలుసులే
ముక్కోటి దేవుళ్ళు మురిసి సూస్తుంటారు
ముందు జనమ బంధాలు ముడియేసి పెడతారు ఆ ఆ ఆ అ
ముక్కోటి దేవుళ్ళు మురిసి సూస్తుంటారు
ముందు జనమ బంధాలు ముడియేసి పెడతారు
కన్నోళ్ళ కన్నీళ్ళు కడుపుతీపి దీవెనలు
కన్నోళ్ళ కన్నీళ్ళు కడుపుతీపి దీవెనలు
మూగమనసు బాసలు ఈ మూగమనసు బాసలు
మీకిద్దరికి సేసలు
ముద్దబంతి పువ్వులో మూగకళ్ళ ఊసులో
ఎనక జనమ బాసలు ఎందరికి తెలుసులే
ముద్దబంతి పువ్వులో ఓ ఓ ఓ
============================
తాళి కట్టు శుభవేళ


తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల ఒహొహూ అహహా ఊహూహు.. యే హే హే...
తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల
ఏనాడు ఏ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో
ఏనాడు ఏ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో

తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాలా....
వికటకవి ని నేను వినండీ ఒక కధ చెపుతాను...
కాకులు దూరని కారడవి...
అందులో.. కాలం యెరుగని మానొకటి..
ఆ అందాల మానులో!! ఆ అద్బుత వనంలో!!..
చక్కని చిలకలు అక్కా చెల్లెలు పక్కన గోరింకలు..
ఒక గోరింకకు ఓ చిలకమ్మకు ఒద్దిక కుదిరెనమ్మ
బావ రావా నన్నేలుకోవా....
తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల....
ఏనాడు ఏ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో
ఏనాడు ఏ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో
మేళాలు తాళాలు మంగళ వాద్యాలు.. మిన్నంటి మోగెనమ్మా...
థుంథుంథుంథుం..థుథుంథుథుం..థుంథుంథుంథుం..థుథుం థుథుం
మేళాలు తాళాలు మంగళ వాద్యాలు.. మిన్నంటి మోగెనమ్మా...
వలపు విమానాన తలపుల వేగాన వచ్చాయి కాన్కలమ్మా..
Singapore airlines announces the arrival of flight S2583
ఊరేగు దారుల వయ్యారి భామలు వీణలు మీటిరమ్మా...
శింగారి జాణల ముంగాలి మువ్వలు ఘల్లున మోగెనమ్మా..
తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాలా....ఒహొహూ అహహా ఊహూహు.. యే హే హే...
తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాలా...
ఏనాడు ఏ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో
ఏనాడు ఏ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో
తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాలా...
గోమాత లేగతొ కొండంత ప్రేమతొ దీవించ వచ్చెనమ్మా...
కాన్వెంటు పిల్లల పోలిన నెమళులు గ్రీటింగ్సు చెప్పిరమ్మా...
Wish you both a happy life... happy happy married life
హి హహ హీ హ హ...హి హి హ హ...
నాలుగు వేదాలు వల్లించు హరిణాలు మంత్రాలు చదివెనమ్మా
మాంగల్యం తంతునానేనా మమ జీవన హేతునా..
కంఠే బద్నామి శుభగే త్వంజీవ శరదాంశతం...
నాలుగు వేదాలు వల్లించు హరిణాలు మంత్రాలు చదివెనమ్మా
పట్టపుటేనుగు పచ్చగ నూరేళ్ళు వర్దిల్ల మనెనమ్మా....
తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాలా...
చేయి చేయిగ చిలుకా గోరింక శయ్యకు తరలిరమ్మా..
చెల్లెలి కోసం త్యాగము చేసిన చిలుకమ్మ తొలగెనమ్మా..
తప్పుగ తలచిన అప్పటి గోరింకకిప్పుడు తెలిసెనమ్మా..
అది చిలుకే కాదని బావిలొ కప్పని జాలిగ తలచెనమ్మా...
తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాలా...
ఏనాడు ఏ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో
తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాలా...
============================
సిరిమల్లె పువ్వా...............

సిరిమల్లె పువ్వా
సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా..చిన్నారి చిలకమ్మా
నా వాడు ఎవరే నా తోడు ఎవరే..ఎన్నాళ్ళకొస్తాడే (2)

సిరిమల్లె పువ్వా

తెల్లారబోతుంటే నా కల్లోకి వస్తాడే
కళ్ళారా చూదామంటే నా కళ్ళు మూస్తాడే
ఆ అందగాడు నా ఈడు జోడు ఏడే
ఈ సందె కాడ నా చందమామ రాడే
చుక్కల్లారా దిక్కులుదాటి వాడెన్నాళ్ళకొస్తాడో

సిరిమల్లె పువ్వా
సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా..చిన్నారి చిలకమ్మా
నా వాడు ఎవరే నా తోడు ఎవరే..ఎన్నాళ్ళకొస్తాడే

సిరిమల్లె పువ్వా

కొండల్లో కోనల్లో కూ యన్న ఓ కోయిలా
ఈ పూల వానల్లో ఝుమ్మన్న ఓ తుమ్మెదా
వయసంతా వలపై మనసే మైమరపై ఊగేనే
పగలంతా దిగులు రేయంతా వగలు రేగేనే

చుక్కల్లారా దిక్కులుదాటి వాడెన్నాళ్ళకొస్తాడో

సిరిమల్లె పువ్వా
సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా..చిన్నారి చిలకమ్మా
నా వాడు ఎవరే నా తోడు ఎవరే..ఎన్నాళ్ళకొస్తాడే

సిరిమల్లె పువ్వా

=======================
ఆకు చాటు పిందె తడిసే కోక మాటు పిల్ల తడిసే

ఆకు చాటు పిందె తడిసే కోక మాటు పిల్ల తడిసే
ఆకు చాటు పిందె తడిసే కోక మాటు పిల్ల తడిసే
ఆకాశగంగొచ్చింది అందాలు ముంచెత్తింది
గోదారి పొంగొచ్చిందీ కొంగుల్ని ముడిపెత్తింది
గూడు చాటు గువ్వ తడిసే గుండె మాటు గుట్టు తడిసే
గూడు చాటు గువ్వ తడిసే గుండె మాటు గుట్టు తడిసే
ఆకాశగంగొచ్చింది అందాలు ముంచెత్తింది
గోదారి పొంగొచ్చింది కొంగుల్ని ముడిపెత్తింది

ముద్దిచ్చి ఓ చినుకు ముత్యమై పోతుంటే
అహ అహ అహాహ
చిగురాకు పాదాల సిరిమువ్వలవుతుంటే
అహ అహ అహ అహ
ఓ చినుకు నిను తాకి తడి ఆరి పోతుంటే
ఓ చినుకు నిను తాకి తడి ఆరి పోతుంటే
ఓ చినుకు నీ మెడలో నగ లాగ నవుతుంటే
నీ మాట విని మబ్బు మెరిసి అహ జడివానలే కురిసి కురిసి
వళ్ళు తడిసి వెల్లి విరిసి వలపు సరిగంగ స్నానాలు చెయ్యాలి
అహ అహ ఆహ అహ అహ ఆహ

మైమరచి ఓ మెరుపు నిన్నల్లుకుంటుంటే
అహ అహ అహ అహ
ఎదలోన ఓ మెరుపు పొదరిల్లు కడుతుంటే
అహ అహ అహా అహ
ఓ మెరుపు నీ చూపై ఉరిమేసి రమ్మంటే
ఓ మెరుపు నీ నవ్వై నన్నే నమిలేస్తుంటే
అహ నీ పాట విని మెరుపులొచ్చి
అహ నీ విరుపులే ముడుపు లిచ్చి
చలిని పెంచి చెలిమి పంచి తనలో వెచ్చంగా తడి ఆర్చుకోవాలి
అహ అహ ఆహ అహ అహ ఆహ
==========================
గున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి

గున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి
ఒక గూటిలోన రామచిలకుంది ఒక గూటిలోన కోయిలుంది
గున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి

చిలకేమో పచ్చనిది కోయిలేమో నల్లనిది
అయినా ఒక మనసేదో ఆ రెంటిని కలిపింది
చిలకేమో పచ్చనిది కోయిలేమో నల్లనిది
అయినా ఒక మనసేదో ఆ రెంటిని కలిపింది
పొద్దున చిలకను చూడందే ముద్దుగ ముచ్చటలాడందే
పొద్దున చిలకను చూడందే ముద్దు ముద్దుగ ముచ్చటలాడందే
చివురులు ముట్టదు చిన్నారి కోయిల
చిలక ఊగదు కొమ్మ ఊయల
గున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి
ఒక గూటిలోన రామచిలకుంది ఒక గూటిలోన కోయిలుంది
గున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి

ఒక పలుకే పలుకుతాయి ఒక జట్టుగ తిరుగుతాయి
ఎండైనా వానైనా ఏకంగా ఎగురుతాయి
ఒక పలుకే పలుకుతాయి ఒక జట్టుగ తిరుగుతాయి
ఎండైనా వానైనా ఏకంగా ఎగురుతాయి
రంగూ రూపు వేరైనా జాతి రీతి ఏదైనా
రంగూ రూపు వేరైనా తమ జాతి రీతి ఏదైనా
చిలకా కోయిల చేసిన చెలిమి
ముందు తరాలకు తరగని కలిమి
గున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి
ఒక గూటిలోన రామచిలకుంది ఒక గూటిలోన కోయిలుంది
గున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి
గున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి
గున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి
=============================
స్వయంవరం

మరల తెలుపనా ప్రియా మరల తెలుపనా //2//
ఎద లోయల దాచుకున్న మధురోహల పరిమళాన్ని //2//
కనుపాపల నింపుకున్న చిరునవ్వుల పరిచయాన్ని ///మ//

విరబూసిన వెన్నెలలో తెర తీసిన బిడియాలని //2//
అణువణువు అల్లుకున్న అంతులేని విరహలని //2//
నిదురపోని కన్నులలో పవళించు ఆశలని
చెప్పలేక చేతకాక మనసు పడే తడబాటుని //మ//

నిన్న లేని భావమేదో కనులు తెరచి కలియచూసి //2//
మాట రాని మౌనమేదో పెదవి మీద ఒదిగిపోయి //2//
ఒక క్షణమే ఆవేదన మరుక్షణమే ఆరాధన
తెలియరాక తెలుపలేక మనసు పడే మధుర బాధ //మ//
===================================
Rudraveena Movie Songs

చిత్రం:
రుద్రవీణ

దర్శకత్వం: బాలచందర్
తారాగణం: జెమిని గణేషన్, చిరంజీవి, శోభన
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సీతారామ శాస్త్రి
గానం: బాల సుబ్రమణ్యం, ఏసుదాస్, చిత్ర
__________________________________________________ _______________

1వ పాట: చుట్టూపక్కల చూడరా

చుట్టూపక్కల చూడరా చిన్నవాడా
చుక్కల్లొ చూపు చిక్కుకున్నవాడా
చుట్టూపక్కల చూడరా చిన్నవాడా
చుక్కల్లొ చూపు చిక్కుకున్నవాడా
కళ్ళ ముందు కటిక నిజం
కానలేని గుడ్డి జపం
సాధించదు ఏ పరమార్దం
బ్రతుకుని కానీయకు వ్యర్ధం
సాధించదు ఏ పరమార్దం
బ్రతుకుని కానీయకు వ్యర్ధం

| చుట్టూపక్కల |

స్వర్గాలను అందుకొనాలని వడిగ గుడిమెట్లెక్కేవు
సాటి మనిషి వేధన చూస్తు జాలిలేని శిలవైనావు
కరుణను మరిపించేదా చదువు సంస్కారం అంటే
గుండె బండగ మార్చేదా సాంప్రదాయమంటే
కరుణను మరిపించేదా చదువు సంస్కారం అంటే
గుండె బండగ మార్చేదా సాంప్రదాయమంటే

| చుట్టూపక్కల |

నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది
గర్వించే యీ నీ బ్రతుకు యీ సమాజమే మలచింది
రుణం తీర్చు తరుణం వస్తే తప్పించుకుపొతున్నావా
తెప్ప తగలపెట్టేస్తావా యేరుదాటగానే
రుణం తీర్చు తరుణం వస్తే తప్పించుకుపొతున్నావా
తెప్ప తగలపెట్టేస్తావా యేరుదాటగానే

|| చుట్టూపక్కల ||
__________________________________________________ _______________

2వ పాట: తులసి దళములచే

తులసి దళములచే సంతోషముగా పూజింతు
తులసి దళములచే సంతోషముగా పూజింతు
తులసి దళములచే సంతోషముగా పూజింతు
తులసి దళములచే సంతోషముగా పూజింతు
తులసి దళములచే సంతోషముగా పూజింతు
తులసి దళములచే సంతోషముగా పూజింతు
తులసి దళములచే సంతోషముగా పూజింతు

పలుమారు చిరకాలము... ఆ
పలుమారు చిరకాలము పరమాత్ముని పాదములను
పలుమారు చిరకాలము పరమాత్ముని పాదములను
|| తులసి ||

సరసీరుహ పున్నాగ చంపక పాగాటల కురవక
సరసీరుహ పున్నాగ చంపక పాగాటల కురవక
కరవీర మల్లిక సుగంధరాజ సుమముల్
కరవీర మల్లిక సుగంధరాజ సుమముల్
ధరణివియొక పర్యాయము ధర్మాత్ముని...
ధరణివియొక పర్యాయము ధర్మాత్ముని
సాకేతపుర వాసుని శ్రీరాముని..
సాకేతపుర వాసుని శ్రీరాముని వర త్యాగరాజనుతుని
|| తులసి ||
__________________________________________________ _______________

3వ పాట: తరలిరాద తనే వసంతం

తరలిరాద తనే వసంతం తన దరికి రాని వనాలకోసం
తరలిరాద తనే వసంతం తన దరికి రాని వనాలకోసం
గగనాల దాక అలసాగకుంటె మేఘాల రాగం ఇల చేరుకోదా

| తరలి |

వెన్నెల దీపం కొందరిదా అడవిని సైతం వెలుగు కదా
వెన్నెల దీపం కొందరిదా అడవిని సైతం వెలుగు కదా
ఎల్లలులేని చల్లని గాలి అందరికోసం అందునుకాదా
ప్రతీ మదినిలేపే ప్రభాత రాగం
పదే పదే చూపే ప్రధాన మార్గం
ఏదీ సొంతం కోసం కాదను సందేశం
మంచే గుణమే పోతే ప్రపంచమే శూన్యం
ఇది తెలియని మనుగడ కథ దిశనెరుగని గమనము కద

| తరలి |

బ్రతుకున లేని శృతి కలదా ఎదసడిలోనే లయలేదా
బ్రతుకున లేని శృతి కలదా ఎదసడిలోనే లయలేదా
ఏ కళకైన ఏ కలకైన జీవితరంగం వేదిక కాదా
ప్రజాధనం కాని కళా విలాసం ఏ ప్రయోజనంలేని వృధా వికాసం
కూసే కోయిల పోతే కాలం ఆగిందా
మారే ఏరే పాడే మరో పదము రాదా
మురళికి గల స్వరమున కళ పెదవిని విడి పలకదుకద

|| తరలి ||

__________________________________________________ _______________


6వ పాట: చెప్పాలని ఉంది

ఒంటరిగా దిగులు బరువు మోయబోకు నేస్తం
మౌనం చూపిస్తుందా సమస్యలకు మార్గం
కష్టం వస్తేనేగద గుండె బలం తెలిసేది
దుఃఖానికి తలవంచితె తెలివికింక విలువేది
మంచైనా చెడ్డైనా పంచుకోను నే లేనా
ఆ మాత్రం ఆత్మీయతకైన పనికిరానా
ఎవ్వరితో ఏమాత్రం పంచుకోను వీలులేని
అంతటి ఏకాంతమైన చింతలేమిటండి

చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది
చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది
గుండెల్లో సుడి తిరిగే కలత కథలు
చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది
చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది

కోకిలల కుటుంబంలో చెడబుట్టిన కాకిని అని అయిన వాళ్ళు వెలివేస్తే అయినానేకాకిని
కోకిలల కుటుంబంలో చెడబుట్టిన కాకిని అని అయిన వాళ్ళు వెలివేస్తే అయినానేకాకిని
చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది
పాట బాట మారాలని చెప్పడమే నా నేరం గూడు విడిచి పొమ్మన్నది నన్ను కన్న మమకారం
వసంతాల అందం విరబూసే ఆనందం తేటి తేనె పాట పంచవన్నెల విరి తోట
వసంతాల అందం విరబూసే ఆనందం తేటి తేనె పాట పంచవన్నెల విరి తోట
బ్రతుకు పుస్తకంలో ఇది ఒకటేనా పుట మనిషి నడుచు దారుల్లో లేదా ఏ ముళ్ళ బాట
మనిషి నడుచు దారుల్లో లేదా ఏ ముళ్ళ బాట
చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది
ఏటి పొడగునా వసంతమొకటేనా కాలం
ఏదీ మరి మిగితా కాలాలకి తాళం
నిట్టూర్పుల వడగాలుల శృతిలో ఒకడు
కంటినీటి కుంభవృష్టి జడిలో ఇంకొకడు
మంచు వంచనకు మోడై గోడు పెట్టువాడొకడు
వీరి గొంతులోని కేక వెనుక ఉన్నదేరాగం
అనుక్షణం వెంటాడే ఆవేదన ఏ రాగం
అని అడిగిన నా ప్రశ్నకు అలిగినాప్త కోకిల
కళ్ళు ఉన్న కబోదిలా చెవులు ఉన్న బధిరుడిలా
నూతిలోని కప్పలా బ్రతకమన్న శాసనం
కాదన్నందుకు అక్కడ కరువాయెను నా స్థానం
చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది

అసహాయతలో దడదడలాడే హృదయ మృదంగధ్వానం
నాడుల నడకల తడబడి సాగే ఆర్తుల ఆరని శోకం
ఎడారి బ్రతుకున నిత్యం చస్తూ సాగే బాధల బిడారు
దిక్కు మొక్కు తెలియని దీనుల వ్యదార్ధ జీవన స్వరాలు
నిలువునా నన్ను కమ్ముతున్నాయి శాంతితో నిలువనీయకున్నాయి
ఈ తీగలు సవరించాలి ఈ అపశృతి సరిచేయాలి
జనగీతిని వద్దనుకుంటూ నాకు నేనె పెద్దనుకుంటూ
కలలో జీవించను నేను కలవరింత కోరను నేను

నేను సైతం విశ్వవీణకు తంత్రినై మూర్ఛనలు పోతాను
నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మ్రోస్తాను
నేను సైతం ప్రపంచాజ్యపు తెల్లరేకై పల్లవిస్తాను
నేను సైతం నేను సైతం బ్రతుకు పాటకు గొంతు కలిపేను
నేను సైతం నేను సైతం బ్రతుకు పాటకు గొంతు కలిపేను
సకల జగతిని శాశ్వతంగా వసంతం వరియించుదాక
ప్రతీ మనిషికి జీవనంలో నందనం వికశించుదాక
పాత పాటను పాడలేను కొత్త బాటను వీడిపోను
పాత పాటను పాడలేను కొత్త బాటను వీడిపోను
నేను సైతం నేను సైతం నేను సైతం
నేను సైతం నేను సైతం నేను సైతం
__________________________________________________ _______________

7వ పాట: నమ్మకు నమ్మకు ఈ రేయిని

చీకటమ్మ చీకటి ముచ్చటైన చీకటి
వెచ్చనైన ఊసులన్ని రెచ్చగొట్టు చీకటి
నిన్ను నన్ను రమ్మంది కన్నుగొట్టి చీకటి
ముద్దుగా ఇద్దరికే వొద్దికైన చీకటి
పొద్దు పొడుపేలేని చీకటే ఉండిపోని మనమధ్య రానీక లోకాన్ని నిద్దరోనీ
రాయే రాయే రామ చిలక సద్దుకుపోయే చీకటెనక...ఆ

నమ్మకు నమ్మకు ఈ రేయిని కమ్ముకు వచ్చిన ఈ మాయని
నమ్మకు నమ్మకు ఈ రేయిని అరె కమ్ముకు వచ్చిన ఈ మాయని
కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసి
నీ కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసి
కలలే వలగా విసిరే చీకట్లను

| నమ్మకు |

వెన్నెలలోని మసకలలోనే మసలునులోకం అనుకోకు
రవికిరణం కనపడితే తెలియును తేడాలన్నీ

| నమ్మకు |

ఆకాశం తాకే ఏ మేడకైన ఆధారం లేదా ఈ నేలలో
ఆకాశం తాకే ఏ మేడకైన ఆధారం లేదా ఈ నేలలో
పుడమిని చూడని కన్ను నడపదు ముందుకు నిన్ను
నిరసన చూపకు నువ్వు ఏనాటికి
పక్కవారి గుండెల నిండ చిక్కనైన వేదన నిండ
పక్కవారి గుండెల నిండ చిక్కనైన వేదన నిండ
హాయి నాదోయి నీవైపు నడువకు

| నమ్మకు |

శీతాకాలంలో ఏ కోయిలైనా రాగం తీసేనా ఏకాకిలా
శీతాకాలంలో ఏ కోయిలైనా రాగం తీసేనా ఏకాకిలా
మురిసే పువ్వులులేక విరిసే నవ్వులులేక ఎవరికి చెందని గానం సాగించునా
పదుగురి సౌఖ్యం పండే దినమే పండుగకాదా
పదుగురి సౌఖ్యం పండే దినమే పండుగకాదా
ఆనాడు ఆశంత గీతాలు పలుకునుకద
గసమ గసమ దమద నిదని
మమమ మగస మమమమదమ దదదనిదద నినినిని
సగసని సని దనిదమదమ నిసనిదసని దనిదమపగ

|| నమ్మకు ||
__________________________________________________ _______________

9వ పాట: లలిత ప్రియ

అతను: లలిత ప్రియ కమలం విరిసినది
అతను: లలిత ప్రియ కమలం విరిసినది
అతను: కన్నుల కొలనిది ఆ..
ఆమె: ఉదయ రవికిరణం మెరిసినది ఊహల జగతిని ఆ..
ఆమె: ఉదయ రవికిరణం మెరిసినది
అతను: అమృత కలశముగా ప్రతినిమిషం
అతను: అమృత కలశముగా ప్రతినిమిషం
అతను: కలిమికి దొరకని చెలిమిని కురిసిన అరుదగు వరమిది

| లలిత |

అతను: రేయి పవలు కలిపే సూత్రం సాంధ్య రాగం కాదా నీలో నాలో పొంగే ప్రణయం
ఆమె: నేల నింగి కలిపే బంధం ఇంద్ర చాపం కాదా మన స్నేహం ముడివేసే పరువం
అతను: కలల విరుల వనం మన హృదయం
అతను: కలల విరుల వనం మన హృదయం
అతను: వలచిన ఆమని కూరిమి నీరగ చేరిన తరుణం
ఆమె: కోటి తలపుల చివురులు తొడిగెను తేటి స్వరముల మధువులు చిలికెను
అతను: తీపి పలుకుల చిలుకల కిలకిల తీగ సొగసుల తొణికిన మిలమిల
ఆమె: పాడుతున్నది ఎదమురళి రాగ ఝరి తరగల మృదురవళి
అతను: తూగుతున్నది మరులవనీ లేత విరి కులుకుల నటనగని
ఆమె: వేల మధుమాసముల పూల ధరహాసముల మనసులు మురిసెను

| లలిత |

ఆమె: కోరే కోవెల ద్వారం నీవై చేరుకోగ కాదా నీకై మ్రోగే ప్రాణం ప్రణవం
అతను: తీసే శ్వాసే ధూపం చూసే చూపే దీపం కాదా మమకారం నీ పూజా కుసుమం
ఆమె: మనసు హిమగిరిగా మారినది మనసు హిమగిరిగా మారినది
ఆమె: కలసిన మమతల స్వరజతి పశుపతి పదగతి కాగా
అతను: మేని మలుపుల చెలువపు గమనము వీణపలికిన జిలిబిలి గమకము
ఆమె: కాలి మువ్వగ నిలిచెను కాలము పూల పవనము వేసెను తాళము
అతను: గేయమైనది తొలి ప్రాయం రాయమని మాయని మధుకావ్యం
ఆమె: స్వాగతించెను ప్రేమ పధం సాగినది ఇరువురి బ్రతుకురధం
అతను: కోరికల తారకల సీమలకు చేరుకొనె వడి వడి పరువిడి
ఆమె: ఉదయ రవికిరణం మెరిసినది ఊహల జగతిని ఆ..

| లలిత |
=====================================





No comments:

Post a Comment

Related Posts with Thumbnails
 

Copyright 2008 All Rights Reserved Revolution Two Church theme by Brian Gardner Converted into Blogger Template by Bloganol dot com